1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Satya Nadella on Microsoft's OpenAI Deal, Xbox's Reset and the A.I. Economy

ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు కొన్ని కంపెనీల నియంత్రణలో ఉండకూడదు : సత్య నాదెళ్ల

sathya Nadella
కృత్రిమ మేథ వల్ల కలిగే ప్రయోజనాలు కొన్ని కంపెనీల నియంత్రణలోనే ఉండకూడదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం కొన్ని కంపెనీల నియంత్రణలోనే ఉండిపోతే, అన్ని రంగాలు తమ నైపుణ్యాన్ని, దీర్ఘకాలిక పోటీతత్వాన్ని కోల్పోయి సంక్షోభంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 
 
మానవ నైపుణ్యం ఆధారంగా ఏఐని నిర్మించాలని కంపెనీలకు సూచించారు. మానవులు, ఏఐ వ్యవస్థలు ఒకరి నుంచి ఒకరు నిరంతరం నేర్చుకోగల దశలోకి వ్యాపారాలు ప్రవేశిస్తున్నాయన్నారు. 
 
ప్రస్తుతం ఉత్పాదకతను మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా ఇతర పనులకు కూడా కృత్రిమ మేథను వినియోగిస్తుండడంతో రాబోయే ఏఐ యుగం మునుపటి సాంకేతిక పరివర్తనల కంటే భిన్నంగా ఉంటుందని సత్యనాదెళ్ల పేర్కొన్నారు. భవిష్యత్‌ కంపెనీల్లో రెండు రకాల ఎదుగుదల ఉండాలన్నారు. మానవుల పరిజ్ఞానం, సృజనాత్మకత, ఏఐ సాంకేతికత కలిస్తేనే సంస్థలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. 
 
ఏఐని స్వతంత్ర మేధస్సుగా చూడకూడదని, మానవ ఆలోచనలను పెంచే, ప్రజల లక్ష్యాల సాధనకు దోహదపడే టూల్‌గా చూడాలన్నారు. ఏఐ తన సామర్థ్యాన్ని మరింత పెంచుకునే కొద్దీ మానవ నైపుణ్యం కూడా మరింత మెరుగవుతుందన్నారు. 
 
కంపెనీకి లక్ష్యాలు నిర్దేశించడంలో, విభిన్నరంగాలలోని ఆలోచనలను అనుసంధానించడంలో ఉద్యోగులు ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తారని వెల్లడించారు. విదేశీ ఏఐ సాంకేతికతపై అధికంగా ఆధారపడకుండా కంపెనీలను మరింత అభివృద్ధి పరిచేలా సొంత సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
El Nino: చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా మారనున్న 2027