బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 13 జులై 2016 (12:43 IST)

స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫీచర్లను ల్యాప్‌టాప్‌లో వాడుకోవాలా? సూపర్‌బుక్‌ ఉందిగా?

స్మార్ట్‌ఫోన్లలో ఉన్న ఫీచర్లను ల్యాప్‌టాప్‌లో వాడుకుంటే ఎలా ఉంటుంది. చాలా బాగుంటుంది కదా.. ప్రస్తుతం అలాంటి సదుపాయంతో కూడిన ఆండ్రాయిడ్ సూపర్ బుక్‌ అందుబాటులోకి వచ్చింది. ఒక్క యాప్‌తో మీ స్మార్ట్ ఫోన్‌

స్మార్ట్‌ఫోన్లలో ఉన్న ఫీచర్లను ల్యాప్‌టాప్‌లో వాడుకుంటే ఎలా ఉంటుంది. చాలా బాగుంటుంది కదా.. ప్రస్తుతం అలాంటి సదుపాయంతో కూడిన ఆండ్రాయిడ్ సూపర్ బుక్‌ అందుబాటులోకి వచ్చింది. ఒక్క యాప్‌తో మీ స్మార్ట్ ఫోన్‌ను పూర్తిగా ల్యాప్‌టాప్‌లా మార్చేసుకునే సదుపాయం వచ్చేసింది. స్మార్ట్ ఫోన్లలో ఉన్న ఫీచర్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 
 
అలాంటి స్మార్ట్ ఫోన్లను.. సాధారణ ల్యాప్‌టాప్ లాగానే ఉండే సూపర్‌బుక్‌లోనే ఆండ్రాయిడ్ ఫోనును ఆపరేట్ చేసుకుని ఫీచర్లను వాడుకోవచ్చు. ఇందుకోసం ఫోన్‌లో "ఆండ్రామియం ఓఎస్‌" అనే అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేసి ఉండాలి. తర్వాత ఫోన్‌ను యూస్‌బీ కేబుల్‌తో సూపర్‌బుక్‌కు కనెక్ట్‌ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఫోన్‌ను పక్కన పెట్టేసి అందులోని అన్ని యాప్‌లను.. ఫీచర్లను ల్యాప్ టాప్ నుంచే వాడుకోవచ్చు. 
 
ప్రస్తుతం బీటా వెర్షన్‌లో గూగుల్‌ ప్లే స్టోర్‌లో "ఆండ్రామియం'' యాప్‌ అందుబాటులో ఉంది. అయితే ఇది ఆండ్రాయిడ్‌ 5.0(లాలీపాప్‌).. ఆ తర్వాతి వెర్షన్‌ ఓఎస్‌లోనే పనిచేస్తుందని.. ఈ సూపర్ బుక్ ల్యాప్‌టాప్ ధర 99డాలర్లు(రూ.6646) ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఈ సూపర్ బుక్ ఆండ్రాయిడ్ 5.0తో పనిచేసే దీనికి మైక్రో-యూఎస్‌బీ, యూఎస్‌బీ-సీ కోర్డ్ ఉంటాయి. మల్టీటాస్కింగ్, మల్టీ- ట్రాక్‌పాడ్, ఫుల్ కీబోర్డ్ (మాక్‌బుక్ ప్రోలా)ను ఇది కలిగివుంటుంది. ఇది స్మార్ట్‌ఫోన్‌కు ఛార్జ్ కూడా అందిస్తుందని.. ఎనిమిది గంటల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ వర్గాలు తేల్చాయి.