శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 జులై 2020 (18:53 IST)

టిక్ టాక్ సూపర్ ప్లాన్.. బీజింగ్‌కు దూరంగా వేరొక చోట హెడ్ ఆఫీస్..?

గల్వాన్ ఉద్రిక్తత నేపథ్యంలో భారత్-చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా టిక్ టాక్ కొంపముంచాయి. భారత్ నుంచి చైనా యాప్‌లు దూరమయ్యాయి. చైనాతో ఘర్షణల కారణంగా కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్‌లపై నిషేధం విధించగా.. వాటిలో టిక్ టాక్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలోనే టిక్‌టాక్‌ తనపై పడిన చైనా ముద్రను తొలగించుకునేందుకు కీలక చర్యలు తీసుకుంటోందని తెలుస్తుంది. బీజింగ్‌లో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయాన్ని మరో చోటకు తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎక్కడికి తరలిస్తారన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు. 
 
అయితే.. టిక్‌టాక్ బీజింగ్‌ ప్రధాన కార్యాలయం తరహాలో ముంబై, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, డబ్లిన్ నగరాల్లో కూడా భారీ కార్యాలయాలు ఉన్నాయి. అయితే.. ప్రధాన కార్యాలయం బీజింగ్‌లో ఉండడంతో టిక్ టాక్ యాప్‌పైన చైనా ప్రభుత్వం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అనేక దేశాలు భావిస్తున్నాయి.
 
ఇదిలావుంటే.. టిక్ టాక్‌పై నిషేధం విధించేందుకు తాము కూడా సన్నద్ధమవుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.