దేశంలోని టెలికాం కంపెనీలు ప్రకటించిన అన్‌లిమిటెడ్ ప్లాన్స్ ఇవే!

రిలయన్స్ జియో దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలన్నీ అన్‌లిమిటెడ్ బాటలో పయనించాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. దేశంలో జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తమ వినియోగదారులను నిలబెట్టుకునేందుకు ఇతర టెలికాం

telecom companies logo's
pnr| Last Updated: సోమవారం, 9 జనవరి 2017 (14:56 IST)
రిలయన్స్ జియో దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలన్నీ అన్‌లిమిటెడ్ బాటలో పయనించాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. దేశంలో జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తమ వినియోగదారులను నిలబెట్టుకునేందుకు ఇతర టెలికాం కంపెనీలు ధరల విషయంలో దిగిరాక తప్పలేదు. ఈవిషయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ ముందుంది. అందుకే తమ వినియోగదారుల కోసం అన్‌లిమిటెడ్ ప్లాన్స్ ప్రకటించింది.

ఆ తర్వాత టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌కు కూడా అన్‌లిమిటెడ్ తిప్పలు తప్పలేదు. ఏదేమైనా అన్ని కంపెనీలు అన్‌లిమిటెడ్ ప్లాన్స్ ప్రకటించడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్లాన్స్ అన్నీ జియోకు ప్రజలు ఆకర్షితులు కాకుండా చూడటం కోసమే అనేది బహిరంగ రహస్యం. ఈ అపరిమిత డేటా, వాయిస్ ప్లాన్స్ ఇలాగే కొనసాగుతాయని కచ్చితంగా చెప్పలేం.

కానీ ప్రజలు మాత్రం ప్రస్తుతానికైనా టెలికాం కంపెనీల అడ్డగోలు ప్లాన్స్ నుంచి తమకు విముక్తి కలిగిందని భావిస్తున్నారు. నిమిషానికి అన్ని పైసలు, ఇన్ని పైసలు అని రకరకాల ప్లాన్స్‌తో ప్రజలను అయోమయంలోకి నెట్టేసిన టెలికాం కంపెనీలు జియో దెబ్బకు ఏకధాటిపైకి వచ్చాయి. గతంలో కొన్ని టెలికాం కంపెనీలు ఫుల్‌టాక్‌ టైం ఆఫర్లు ప్రకటించేవి. కానీ వ్యాలిడిటీ మూడు రోజులు, రెండు రోజులంటూ అడ్డగోలు షరతులు విధించేవి. ఇపుడు ఆ విధానానికి స్వస్తి చెప్పి.. అన్‌లిమిటెడ్ ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రస్తుంతం ప్రముఖ టెలికాం కంపెనీలు ప్రకటించిన అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే...

అన్‌లిమిటెడ్ మంత్లీ ప్లాన్స్:

బీఎస్‌ఎన్‌ఎల్:
* అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 300 ఎంబీ ఉచిత డేటా, 144 రూపాయలు, 30 రోజుల వ్యాలిడిటీ.

ఎయిర్‌టెల్:
*అన్‌లిమిటెడ్ ఎయిర్‌టెల్ టూ ఎయిర్‌టెల్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 300 ఎంబీ ఉచిత డేటా: 148 రూపాయలు, 28 రోజుల వ్యాలిడిటీ.

*అన్‌లిమిటెడ్ ఆల్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 1జీబీ ఉచిత 4జీ డేటా : 349రూపాయలు, 28రోజుల వ్యాలిడిటీ.

వొడాఫోన్:
* అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ వొడాఫోన్ టూ వొడాఫోన్ కాల్స్, 300 ఎంబీ డేటా, 149 రూపాయలు, 28రోజులు.

* అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 1జీబీ 4జీ ఉచిత డేటా, 349రూపాయలు, 28 రోజుల కాలపరిమితి.

ఐడియా:
*అన్‌లిమిటెడ్ ఐడియా టూ ఐడియా లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 300 ఎంబీ 4జీ డేటా: 148 రూపాయలు, 28 రోజులు.

*అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 1జీబీ 4జీ డేటా: 347రూపాయలు, 28 రోజుల వ్యాలిడిటీ.

టెలినార్:
*ఎస్టీవీ 249... అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 1జీబీ 4జీ డేటా, అపరిమిత 2జీ డేటా, 28రోజుల వ్యాలిడిటీ.

టాటా డొకొమో:
* 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 298 రూపాయలు, 28 రోజుల వ్యాలిడిటీ.

* అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 246 రూపాయలు, 28 రోజుల వ్యాలిడిటీ.దీనిపై మరింత చదవండి :