మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకు ఖాతాదారులు కూడా తమ వ్యక్తిగత బ్యాంకు పనుల కోసం బ్యాంకుకు వెళ్లకుండా ఇంట్లోనే పనులు చక్కబెట్టుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేయడం, వివిధ రకాల బిల్లులు చెల్లించడం, చెక్‌బుక్ రిక్వెస్ట్, చెక్ పేమెంట్స్ నిలుపుదల, ఫిక్స్డ్ డిపాజిట్ వేయడం తదితర పనులను ఇంట్లో నుంచి పూర్తి చేస్తున్నారు. ఇదేలా సాధ్యమని అనుకుంటున్నారు. సింపుల్. ఆన్లైన్ బ్యాంకింగ్ విధానాన్ని వినియోగించడం వల్ల సాధ్యపడుతుంది.