'వొడాఫోన్' అనగానే మనకి వెంటనే గుర్తు వచ్చేవి జూజూలు. అవేనండి! బెలూన్ ఆకారంలో, కోడిగుడ్డు తలతో, తెల్లటి రంగులో ఉండి వాటి బుడిబుడి నడకలు, చిలిపి చేష్టలతో గత ఏడాదంతా వొడా ఫోన్ ప్రచారంలో కీలకపాత్ర పోషించి ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని చూరగొన్న జూజూలు ఇప్పుడిక కొంత కాలం విశ్రాంతి తీసుకోనున్నాయి. వీటి స్థానంలో ఇప్పుడు కొత్తగా ఓ యానిమేటెడ్ చిలక దర్శనమివ్వబోతోంది.