ప్రముఖ మొబైల్ ఉత్పత్తి సంస్థ సోనీ కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోన్లో స్నానం చేసుకుంటూ మాట్లాడుకోవచ్చునని ఆ సంస్థ వెల్లడించింది. స్నానం చేసుకుంటూ మాట్లాడినా.. ఆ స్మార్ట్ ఫోనుకు ఎలాంటి డామేజ్ కాదని ఆ సంస్థ తెలిపింది. కొత్త ఎక్స్‌పీరియా ఈజెడ్ అనే ఐదు ఇంచ్‌ల స్క్రీన్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్లను నీటిలో 3.3 అడుగుల లోతులో 30 నిమిషాల పాటు ఉపయోగించేలా సోనీ రూపొందించింది. ఇంకా ఈ ఫోన్లో హెచ్డీఆర్ వీడియో నమోదు చేసుకోవచ్చు.