పింటెరెస్ట్ ఫీచర్లు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ తన వెబ్ వెర్షన్ను ప్రారంభించింది. ఇక ఫేస్బుక్ తన అడ్వర్టైజింగ్ ఆఫ్షన్లను క్రమంగా విస్తరించుకుంటూ వెళుతోంది. ఇలా చూసినప్పుడు భవిష్యత్తంతా సోషల్ మీడియాతో ముడివడిపోతుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. కనుక వీటికి సంబంధించిన అంశాలను మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది.