మాజీమంత్రి, వైకాపా మాజీ నాయకుడు మారెప్ప మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణాస్త్రాలు సంధించారు. జగన్ మోహన్ రెడ్డిని నమ్మితే పచ్చిమోసం చేశారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే ఒయాసిస్సులే కనబడతాయనీ, ఎంతదూరం వెళ్లినా అదే గతి అని చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న గౌరవంతో ఆ పార్టీలోకి వెళితే నిలువునా ముంచేశారని విమర్శనాస్త్రాలు సంధించారు.