రైతుల కోసం ఢిల్లీ నుంచి గల్లీ దాకా దీక్షలపై దీక్షలు చేస్తున్నా ఈ చెవిటి ప్రభుత్వానికి ఎంతమాత్రం వినబడటం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మండిపడ్డారు. రైతు సమస్యలపై 45 గంటలపాటు దీక్ష చేసిన జగన్, దీక్ష విరమించిన అనంతరం కిరణ్ సర్కార్ను తూర్పారబట్టారు. రైతులకు అండగా నిలబడాల్సిన ఈ ప్రభుత్వం, రైతు వెన్ను విరిచేవిధంగా వ్యవహరిస్తోందన్నారు.