గుంటూరు జిల్లా నర్సరావు పేట మండలం నకిరేకల్‌లో జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. జగన్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు, గులకరాళ్లు విసిరారు. జగన్ వాటి నుంచి తృటిలో తప్పించుకున్నారు.