వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి గర్వమెక్కువా? అహం ఎక్కువా? అంటే పార్టీ శ్రేణుల్లో అవుననే సమాధానమే వస్తోంది. ప్రజల్లో తిరిగేటప్పుడు సామాన్యుడిగా కనిపించే జగన్‌కు.. పార్టీ లీడర్‌గా కనిపించే జగన్‌కు చాలా తేడాలున్నాయని వైకాపా శ్రేణుల్లో టాక్.ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీలో నేతల మధ్య మనస్పర్థలు, లుకలుకలు ఉన్న మాట నిజమేనని ఆ పార్టీ సీనియర్ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అంగీకరించారు. వైకాపా నుంచి పలువురు నేతలు వరుసగా పార్టీని వీడుతుండటంపై దృష్టి సారించామని, అన్ని పార్టీల్లో ఉన్నట్లే తమ పార్టీలోనూ విభేధాలున్నాయని మేకపాటి స్పష్టం చేశారు.