చంద్రబాబు నాయుడు లెక్కకు మిక్కిలి ఆస్తులను బినామీ పేర్లతో కలిగి ఉన్నారంటూ వైఎస్ విజయమ్మ పిటీషన్‌పై హైకోర్టు ఆదేశం నేపధ్యంలో చంద్రబాబు ఆస్తులపై సీబీఐ ప్రాథమిక విచారణను చేపట్టింది. ఐతే తమ నాయకుడికి ఎటువంటి బినామీ ఆస్తులు లేవని తెలుగుదేశం పార్టీ నాయకులు చెపుతున్నారు. చంద్రబాబు నాయుడు తన జీవితం తెరిచిన పుస్తకం అనీ, తన ఆస్తులను ఇప్పటికే ప్రకటించేశానని అంటున్నారు. ప్రకటించిన ఆస్తులకు మించి ఒక్క పైసా చూపించినా తన ఆస్తులన్నిటినీ రాసేస్తానని ప్రతిజ్ఞ సైతం చేస్తున్నారు.