అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఏడాది కాలంగా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టులకు బెయిల్ కోసం పిటీషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. సీబీఐ విచారణ మరోవైపు సాగుతూనే ఉంది. కాగా అసలు బెయిల్ విషయంలో పార్టీ నేతలు, ముఖ్య నాయకులు చేస్తున్న వ్యాఖ్యల వల్లనే జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ రావడం లేదన్న కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి.