కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఒకప్పుడు వేధించిన కోవర్టుల బెడద ఇపుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకున్నదట. ఆ పార్టీకి జనాదరణ బాగానే ఉన్నా పార్టీ జిల్లాస్థాయిలో ఉన్న నేతలు కొందరు అధికార పార్టీతో లాలూచిపడి కోవర్టుల్లా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు వ్యక్తం చేస్తున్నారట. ఇదే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డికి దృష్టికి తీసుక వెళ్లినట్లు సమాచారం. అన్నీ తానై పార్టీని నడుపుతున్న జగన్ దీనిపై లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.