జగన్ వర్గం ఎమ్మెల్యేలు జారిపోతున్నారనే కథనాలు ప్రముఖ పత్రికల్లో జోరందుకోవడంతో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వర్గ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు భేటీ కాక మునుపే ఎమ్మెల్యే శేషారెడ్డి కాంగ్రెస్ పార్టీ వెంటే కొనసాగుతానని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పారు.