త్వరలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేయబోతున్నారు. ఈ పాదయాత్ర వెనుక స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ అంతా నారా లోకేషే అని అంటున్నారు. అదలావుంచితే తాజాగా తెదేపాలో నారా లోకేష్ కీలక బాధ్యతలను నిర్వహించనున్నారనే వాదనలు వినబడుతున్నాయి. 2014 ఎన్నికలే లక్ష్యంగా నారా లోకేష్‌ను రంగంలోకి దించుతున్నట్లు తెదేపా నాయకులు అంతర్గతంగా చెప్పుకుంటున్నారు.