ఉప ఎన్నికలకు ముందే కృష్ణా జిల్లాలో అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు దొంగచూపులు చూస్తున్నారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన వంగవీటి రాధాకృష్ణ జగన్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.