అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కారాగారం పాలయ్యారు. 2014 ఎన్నికలకు మరో ఏడాది ఉంది. ఈ ఎన్నికల నాటికి జగన్ మోహన్ రెడ్డి బయటకు వస్తారని జగన్ సోదరి షర్మిలతోపాటు రోజా లాంటి వారు కూడా జోస్యం చెపుతున్నారు. రోజా అయితే ఓ అడుగు ముందుకు వేసి 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేస్తున్నారు.