ఆటలు, పాటలు, మాటలు, సందేశాలతో పిల్లలను అమిత వినోదంలో ముంచెత్తుతున్న సెల్ఫోన్ వారికో వ్యసనమైందని ప్రపంచ ప్రసిద్ధి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. సెల్ఫోన్ వినియోగం, పిల్లల సర్వేలో 6-9 ఏళ్లలోపు 22 శాతం, 10-14 ఏళ్లలోపు 60 శాతం, 15-18 ఏళ్లలోపు 84 శాతం మంది పిల్లలు సెల్ఫోన్లు వాడుతున్నారని తెలిసింది.ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న కొత్త ఫోన్లను పరిశీలించండి.. పిల్లలను దృష్టిలో పెట్టుకొని కలర్ఫుల్ కిడ్-ఫ్రెండ్లీ ఫోన్లను సులువుగా ఉపయోగించగలిగే ఫీచర్స్తో సదరు కంపెనీలు లాంచ్ చేస్తున్నారు. రానున్న మూడేళ్లలో 8-12 ఏళ్లలోపు పిల్లలు 54 శాతం సెల్ఫోన్లు వినియోగించవచ్చు.