ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ట్యూషన్ ఫీజుల నిర్ధారణ, నియంత్రణల అధికారాన్ని కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటయ్యే జిల్లా ఫీజు నియంత్రణా కమిటీ (డీఎఫ్‌ఆర్‌సీ)లకే అప్పగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవోఎంఎస్ నెం.91ని ప్రభుత్వం జారీ చేసింది. ట్యూషన్ ఫీజులకు సంబంధించి స్కూల్ గవర్నింగ్ బాడీ పంపించిన ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్, డీఈఓ, జిల్లా ఆడిట్ అధికారితో కూడిన త్రిసభ్య కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది.