ఈ కోతి పడిన శ్రమను చూస్తే... కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది గుర్తొస్తుంది
కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది అనేది సమాజంలోని అసమానతలను, కొన్ని జీవన సత్యాలను ప్రతిబింబించే ఒక చేదు నిజం. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఓ వీడియోలో ఒక కోతి చెట్టు పైన వున్న పండును తినేందుకు ఎంతో శ్రమపడుతూ సన్నటి కొమ్మ పైకి ఎక్కింది. ఆ పండును ఎంతో తెలివిగా కొమ్మను వంచి తన చేతిలోకి తీసుకునే లోపుగా మరో కోతి ఆ ఫలాన్ని లాగేసుకుని నోట కరిపించుకున్నది. ఇది చూస్తే.. పైన చెప్పుకున్న సామెత గుర్తుకు వస్తుంది. ఇక మన సమాజం గురించి చూస్తే...
वास्तव में परिश्रम कोई और करता है और परिश्रम पूर्ण होते-होते फल कोई और खा लेता है यही दुनिया है pic.twitter.com/SdjPkz7w0x
— NARAYAN MAHRAJ (@__DINA_3) May 1, 2026
చాలా సందర్భాల్లో క్షేత్రస్థాయిలో కష్టపడేది శ్రామికులు అయితే, దాని వల్ల వచ్చే లాభాలను పెట్టుబడిదారులు లేదా యజమానులు పొందుతుంటారు. ఉదాహరణ: ఎండలో రక్తాన్ని చెమటగా మార్చి భవనాన్ని నిర్మించేది కూలీలు, కానీ అందులో విలాసవంతంగా నివసించేది యజమాని.
ఆఫీసుల్లో లేదా ప్రాజెక్టుల్లో రాత్రింబగళ్లు కష్టపడి పనిని పూర్తి చేసేది కింది స్థాయి సిబ్బంది కావచ్చు. కానీ, పైఅధికారుల దగ్గర ఆ పేరును, ప్రశంసలను కేవలం టీమ్ లీడర్ లేదా బాస్ మాత్రమే దక్కించుకున్నప్పుడు ఈ మాట వినిపిస్తుంది.
తల్లిదండ్రులు తమ జీవితాంతం కష్టపడి సంపాదిస్తారు, కానీ ఆ ఫలితాన్ని(సుఖాన్ని) వారి పిల్లలు అనుభవిస్తారు. ఇక్కడ ఒకరి కష్టం మరొకరికి పునాది అవుతుంది.
కొన్నిసార్లు ఒకరు వేసిన పునాదిపై మరొకరు విజయాన్ని అందుకుంటారు. రాజకీయాల విషయానికి వస్తే... ఒక నాయకుడు పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మిస్తే, గెలిచిన తర్వాత పదవులు మరొకరికి దక్కవచ్చు.
సమాజంలో వనరులు, అవకాశాలు అందరికీ సమానంగా ఉండవు. తెలివితేటలు, కష్టం ఉన్నా కూడా సరైన 'బ్యాక్ గ్రౌండ్' లేకపోవడం వల్ల కొందరు వెనుకబడిపోతారు. అదే సమయంలో తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితాన్ని పొందే వారు ఉంటారు.
నిజానికి, లోకరీతి ఇలాగే ఉంటుంది. అయితే, భగవద్గీతలో చెప్పినట్టు... కర్మణ్యేవాధికారస్తే... అంటే, పని చేయడం వరకే నీ చేతుల్లో ఉంది అన్నట్టు మనం మన కష్టాన్ని నమ్ముకోవడమే ముఖ్యం. ఫలితం ఎవరికి దక్కినా, ఆ కష్టం నేర్పిన అనుభవం మాత్రం ఎప్పటికీ మన సొంతమే
