జీవుడికి, శివుడి మధ్య బేధం లేదు. తరచి చూస్తే జీవుడే శివుడు, శివుడే జీవుడు. ఏ జీవినీ హీనంగా చూడరాదు. జీవిని చంపడమంటే శివభక్తి తప్పడమేననీ, జీవహింస మహాపాపమని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.