ఆడువారి ఊహలకి అర్థాలే వేరులే..

WD
ఒక వ్యక్తి తన సెక్రటరీతో ప్రేమ కలాపాలు కొనసాగిస్తున్నాడు. ఒక రోజు మధ్యాహ్నం వేళ నుంచీ ఇద్దరూ ఆఫీసు నుంచి మాయమయ్యారు. ఇద్దరూ బాగా రొమాన్స్ చేసుకున్నారు. అలా రాత్రి 9 దాటిపోయింది.

ఇంటికి వెళ్లే ముందు అతను తన సెక్రటరీకి తన బూట్లు ఇచ్చి వాటిని దొడ్లో ఉన్న బురద మట్టిలో బాగా ముంచి తీసుకురమ్మన్నాడు. సెక్రటరీ అలాగే చేసింది. తన ప్యాంటుకు, షర్టుకు కూడా కాసింత బురద పూసుకుని ఇంటికి వెళ్లాడు.

ఇంటి దగ్గర అతని భార్య కోపంతో ఉడికిపోతూ భర్తకోసం ఎదురుచూస్తోంది. అతను ఇంట్లో ప్రవేశించగానే... ఆగండక్కడ. ఇంత పొద్దు పోయేవరకూ ఎక్కడ ఉన్నారు...? అని ప్రశ్నించింది. దానికి భర్త, నన్ను క్షమించు డార్లింగ్. నేను నా సెక్రటరీతో కలిసి ఇప్పటివరకూ గడిపి వచ్చాను. ఈ రోజంతా ఆమెతోనే ఆమె ఇంట్లోనే ఉన్నాను. అని భర్త తలవంచుకుని చెప్పాడు.

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
భార్య అతని బట్టలకేసి తేరిపార చూసి, పిల్లల్లా అబద్ధాలు చెప్పడానికి మీకు సిగ్గు లేదూ.. ఈ రోజు మళ్లీ పిచ్చిపట్టినట్లు గ్రౌండులో క్రికెట్ ఆడి వచ్చారా...? రండి స్నానానికి నీళ్లు తోడాను అంది.


దీనిపై మరింత చదవండి :