ప్రేమలోకంలో విహరించే జంట మధ్య చోటుచేసుకునే ప్రతి సంఘటన ఓ తీయన అనుభూతిని మిగులుస్తుంది. ఇద్దరూ ఊహాలోకంలో విహరిస్తూ ఎన్నో బాసలు చేసుకుంటారు. మృదుమధురంగా... తీపి జ్ఞాపకాలుగా మిగిలే ఆ తీయని అనుభూతులు ఎలా ఉంటాయో మన తెలుగు వెండితెర కూడా కాస్తంత ఒలికించింది. ప్రేయసీప్రియుల ఊహలకు దాశరథి రెక్కలు తొడిగితే... ఇద్దరి మదిలో మెదిలే భావాలకు ప్రాణం పోశారు ఎస్పీబీ.. వాణీజయరాం. మరచిపోలేని ఆ లవ్ సాంగ్‌ని ఓసారి చూద్దామా....