ఓ మై బంజారా బ్యూటీ...

Venkateswara Rao. I|
WD
నిను చూసిన ఆ క్షణం
నా మనసు నీదైపోయింది
నువు నన్ను చూసిన మరుక్షణం
నా గుండె నీతోటిదే లోకమంటోంది

మిడ్డీల్లో... మినీ గౌన్లలో...
మినీ టాపుల్లో... మినీ స్కర్టుల్లో...
ఆధునిక అమ్మాయి అందాలు
ఆరబోసినా చలించని నా హృదయం

నీ అమాయకపు మోము
నీ అందమైన నవ్వు
నీ అద్భుతమైన సొగసు
నా హృది తంత్రిని మీటింది

నీ సొగసులు నన్ను వెంటాడుతున్నాయ్
నీ కనులు నన్ను పలుకరిస్తున్నాయ్
నీ పెదవులు నన్ను పిలుస్తున్నాయ్
నీ సిరులు అందుకునేందుకు

నీకోసమే
నిరీక్షిస్తూ
నీ లవ్ వీరుడు


దీనిపై మరింత చదవండి :