లేటెస్ట్ "లవ్" ట్రెండ్.. అమ్మాయి - అబ్బాయిల రెచ్చగొట్టుడు సంభాషణలు

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT| Last Modified మంగళవారం, 13 మార్చి 2012 (17:41 IST)
WD
ప్రేమలో పీకల్లోతు కూరుకుపోయిన యువతీయువకులు ఇదివరకు ప్రేమలేఖల్లో తమ భావనలను వర్ణించుకుంటూ ఉండేవారు. కానీ నేడు ఈ ట్రెండ్ మారింది. ఫ్లిర్టీ సంభాషణలు ఎక్కువయ్యాయట. ముఖ్యంగా సెల్ ఫోను సంభాషణలు చేస్తున్న టీనేజ్ బాయ్స్ అండ్ గాళ్స్ తమతమ ప్రేయసీ ప్రియుల అందాల వర్ణనల్లో రెచ్చగొట్టుడు సంభాషణలు చేస్తున్నారట.

అవెలా ఉన్నాయని అంటే.... ఇవి చూడండి ఇలా..

అబ్బాయి: ఎక్స్‌క్యూజ్ మి
అమ్మాయి: చెప్పండి
అబ్బాయి: మీరు డిక్షనరీయా
అమ్మాయి: కాదు
అబ్బాయి: కానీ మీరు డిక్షనరీయే. ఎందుకంటే నా జీవితానికి మీరే అర్థం ఇచ్చారు.

చంద్రుడు రేయి కోసం
రాత్రి ఒక రోజు కోసం
సూర్యుడు పగలు కోసం
భూమి మన కోసం
నువ్వు నా కోసం

ఇలాంటి ఎస్ఎమ్ఎస్‌లే కాదు.. అందాల వర్ణనలు మరింత లోతుగా వర్ణించుకుంటూ సందేశాలు.. సంభాషణలు సాగించేస్తున్నారట టీనేజ్ లవర్స్. మొత్తానికి సమాచార సాంకేతిక విప్లవం లవర్స్‌నూ కొత్త ఫ్లిర్టీ పుంతలను తొక్కిస్తోంది.

English Summary: Latest love expressions... Boys are expressing their love thoughts to his girlfriends by sending romantic, lovely and flirt messagesదీనిపై మరింత చదవండి :