ఒకరోజు మీ గర్ల్‌ఫ్రెండ్‌ను డిన్నర్‌కు తీసుకెళ్లి చూడండి...

Love
Venkateswara Rao. I|
FILE
ప్రేయసీ ప్రియుల మధ్య బంధం మరింత పటిష్టపడాలంటే కొన్ని చిట్కాలను పాటించాలంటున్నారు ప్రేమగురువులు. అవేంటో ఒక్కసారి చూద్దాం...

అందంగా సింగారించుకోండి. మ్యాచింగ్ బ్లౌజులో అందమైన చీరలోను మీ సుందరాకృతి మీ ప్రియుడిని మైమరిపిస్తుంది. అంతే మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం ఉండలేడు.

అధర చుంబనం అందించాలని అనిపించినప్పుడు ఆమె కురులు లేదా మెడ వంపును సున్నితంగా చేతులతో స్పృశించండి.

అమ్మాయి అందాన్ని మరీ అతిగా పొగడకండి. అసలుకే ప్రమాదం రావచ్చు. మిమ్మల్ని అనుమానంగా చూడనూవచ్చు.

ఆమె ఇష్టాయిష్టాలను తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఒకరోజు మీ గర్ల్‌ఫ్రెండ్‌ను డిన్నర్‌కు తీసుకువెళ్లండి. ఆమెకు నచ్చిన ఆహారాన్ని మీరు కూడా స్వీకరించండి. అలా ఆమెకున్న ఇష్టాలను మీరు ఇష్టంగా చేసుకుంటే ప్రేమ రెట్టింపవుతుంది.

ఆమె చేసిన మంచి పనులను ప్రశంసించడం మరువకండి. ఆమెను ప్రశంసించడంలో మీరు ఉపయోగించే రెండు పదాలు ఎంతో సత్ప్రభావాన్ని చేకూరుస్తాయి.

ఆమెకు ఇష్టమైన డ్రెస్ కలర్ ఏమిటో తెలుసుకోండి. సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఆమెకు అదే కలర్ డ్రెస్ కొనివ్వండి. బయటకు వద్దన్నా లోపల ఆమె చాలా ఆనంద పడుతుంది.


దీనిపై మరింత చదవండి :