ఆహ్లాదకర ప్రకృతి నిలయం... ఉబ్బలమడగు జలపాతం

Hill
FileWD
పెద్దగా పేరు లేకున్నా రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఎన్నో సుందర జలపాతాలున్నాయి. మిగిలిన జిల్లాల మాట అటుంచి ఒక్క చిత్తూరు జిల్లాలోనే జలపాతాలతో కూడిన ఎన్నో సుందర పర్వతప్రాంతాలు పర్యాటకుల కోసం సిద్ధంగా ఉన్నాయి. కొంచెం శ్రమ, కాస్త ఓపికను వెచ్చించగల్గితే ఈ సుందర ప్రదేశాలను దర్శించి ప్రకృతి ఒడిలో సేదతీరవచ్చు.

ఇలా చెప్పుకుంటే చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి పట్టణానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ సుందర జలపాతం గురుంచి చెప్పవచ్చు. శ్రీకాళహస్తి-చెన్నై మార్గమధ్యంలోని మండల కేంద్రమైన వరదయ్యపాళెం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండలనడుమ ఉన్న ఈ జలపాతం పేరు ఉబ్బలమడుగు. ఈ జలపాతాన్ని సందర్శించడానికి పలు మార్గాలు ఉన్నా వరదయ్యపాళెం మీదనుంచి మాత్రమే వాహనాలు వెళ్లగలిగే రోడ్డు సౌకర్యం ఉంది. అందుకే పర్యాటకులు ఈ మార్గాన్నే ఎంచుకుంటారు.

ఉబ్బలమడుగు జలపాతం విశేషాలు :
ఎత్తైన పర్వతశ్రేణిలో ఉన్న ఈ జలపాతాన్ని చేరుకోవాలంటే కొండల పాదప్రాంత ప్రదేశం నుంచి కొంచెం దూరం గుట్టలమీదుగా నడవాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న అడవి, పైన ఉన్న జలపాతం నుంచే పారే సెలయేటి గలగలలు, పక్షుల కిలకిలా రావాలు, నగర కాలుష్యానికి దూరంగా నిర్మలమైన ప్రశాంతత వెరసి ప్రకృతిమాత ఒడిలో ఓ రోజంతా సేద తీరడానికి ఇదో చక్కని ప్రదేశంగా చెప్పవచ్చు.

Munibabu|
ఉబ్బలమడగు ప్రదేశంలో అడుగు పెట్టగానే ముందుగా ఓ చిన్న సరసు పర్యాటకులకు దర్శనమిస్తుంది. ఈ సరస్సు దగ్గరినుంచే దట్టమైన అటవీప్రాంతం ప్రారంభమవుతుంది. కొండలమీదుగా జలపాతం దగ్గరకు వెళ్లలేని పర్యటకులు ఈ సరస్సు వద్దే జలకాలాడి ఇక్కడే సేదతీరుతారు. అయితే జలపాతాన్ని సందర్శించాలంటే మాత్రం గుట్టలమీదుగా దాదాపు రెండు,మూడు కిలోమీటర్లు నడవాల్సిందే. ఈ దారిలో ప్రయాణం కాస్త శ్రమతో కూడుకున్నదే. ఎందుకంటే పెద్దవిగా ఉన్న ఈ బండలమీదకు గెంతుతూ వెళ్లాల్సి ఉంటుంది.


దీనిపై మరింత చదవండి :