ఆరావళీ పర్వత శ్రేణులలో అందమైన రాణిలాగా వెలిగిపోతుండే మౌంట్ అబూ చిరునవ్వుతో సుస్వాగం పలుకుతున్నట్లుగా ఉంటుంది. పకృతి గీసిన చిత్రాలనే కాకుండా, పరవశింపజేసే ఆలయాలను సైతం తనలో ఇముడ్చుకున్న మౌంట్ అబూలో రాజస్థాన్ హస్తకళల అందాలకూ కొదవేలేదు. అలాగే నక్కి సరస్సు జల సౌందర్యం, దిల్‌ఖుష్ చేసే దిల్‌వారా ఆలయాలు, వశిష్ట మహర్షి ఆశ్రమం... ఇలా ఒక్కటేమిటి, ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అద్భుతమైన ప్రదేశం మౌంట్ అబూ. ఎర్రటి ఎండలనే కాదు, చల్లటి మౌంట్ అబూను తనలో దాచుకున్న రాజస్థాన్ వెళ్లేందుకు అయ్యో.. ఎర్రటి ఎండల్లోనా...? అని గాబరా పడాల్సిందేమీ లేదు.. ఎంచక్కా మన మౌంట్ అబూ ఉండనే ఉందిగా మరి...!!