కళాఖండాలతో కొలువుతీరిన ''ఖజురహో''

kajuraho
WD
నిజజీవితంలోని విభిన్న కోణాల్ని ఇక్కడి శిలలు అణువణువునా ఆవిష్కరిస్తున్నాయి. ఛండేలా రాజపుత్రుల కృషికి ఇవి దర్పణాలుగా నిలుస్తాయి.

ఖజురహో కథాకమామీషు :
1) చరిత్ర... కథాకమామీషు
ఖజురహో దేవాలయాల నిర్మాణానికి దాదాపు వందేళ్లు పట్టింది. క్రీ.శ. 950-1050 మధ్య కాలంలో ఛందేలా రాజపుత్ర రాజులు ఈ గుహాలయాల నిర్మాణాన్ని చేపట్టారు. కళాత్మక నైపుణ్యానికి, వైభవానికి ఈ గుహాలయాలు దర్పణాలు. మొత్తం 85 దేవాలయాల్లో ఇప్పటికే నిలిచి ఉన్నవి కేవలం 22 మాత్రమే. జులై-మార్చి మధ్య కాలం ఖజురహో సందర్శించడానికి అనువైనది.

2) ఏ మేం చూడొచ్చు :
ఖజురహోలోని ప్రతి గుడికీ ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి. అవి
1. అర్ధ-మండప (ప్రవేశద్వారం)
2. మండప (ప్రధాన గృహం/మండువా)
3. గర్భ గృహం
ఈ ఖజురహో గుహాలయాల్ని భౌగోళికంగా తూర్పు ప్రాంతం, దక్షిణ ప్రాంతం, పశ్చిమ ప్రాంతంగా విభజించారు.

వివరాలు
తూర్పు ప్రాంతం :
ఆదినాధ దేవాలయం : జైన తీర్ధాందకరుడు. ఆది నాధుడికి అంకితమైన ఆలయం ఇది.

ఘంటాయ్‌ గుడి : ఇది కూడా జైన దేవాలయం. ఇందులో వర్ధమాన మహావీరుడి తల్లి యొక్క 16 స్వప్నాల్ని ఆవిష్కరించే చిహ్నాలు ఉన్నాయి. గరుడ పక్షిపై ఉన్న జైన దేవత చిహ్నం కూడా ఇక్కడ ఉంది.

పార్శ్వనాధ దేవాలయం : ఇక్కడ ఉన్న జైన దేవాలయాల్లో కెల్లా అతిపెద్ద దేవాలయం ఇది. ఉత్తరం దిక్కున ఉన్న కుడ్సాలపై చిత్రాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. నిజజీవితంలోని రోజువారీ కార్యక్రమాల్ని ఇవి ప్రతిబింబిస్తాయి. మొదటి
తీర్ధాంకరుడైన ఆదినాధుడి వృషభానికి ఎదురుగా ఉన్న సింహాసనం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. 1860లో ఇక్కడ పార్శ్వనాధుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

దక్షిణ ప్రాంతం :
చతుర్భుజ దేవాలయం : విష్ణుమూర్తిని గర్భగృహంలో కలిగిన దేవాలయమిది.
దూల్‌దాహ దేవాలయం : ఇది శివాలయం. అప్సర, కిన్నెర కింపురుషాదుల కూడ్య చిత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
పశ్చిమ ప్రాంతం :
మాతానాగేశ్వర దేవాలయం : ఇది శివాలయం ఎనిమిది అడుగుల ఎత్తున్న లింగం ఇక్కడ ప్రసిద్ధి.

లక్ష్మణ దేవాలయం : ఇది వైష్ణవాలయం. ఇక్కడ త్రిమ్తూరులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. విష్ణుమూర్తి అర్ధాంగి లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంది. విష్ణుమూర్తి అవతారాలైన నరసింహావతారం, వరాహావతరాలతో కూడిన విగ్రహం ప్రసిద్ధి
చెందింది. ఇలాంటి వరాహావతారం - వరాహ దేవాలయంలో కూడా - తొమ్మిది అడుగుల ఎత్తుతో అలరారుతోంది.

విశ్వనాథ దేవాలయం : మూడు తలల బ్రహ్మ విగ్రహం ఇక్కడ ఉంది.

చిత్రగుప్త దేవాలయం : ఇది సూర్య దేవాలయం. ఉదయించే సూర్యుడిని దర్శిస్తూ తూర్పు ముఖాన ఈ దేవాలయం ఉంది.

చౌంసత్‌ యోగిని దేవాలయం : ఖజురహోలోని గ్రానైట్‌తో తయారైన ఏకైక దేవాలయం ఇది. అన్నింటిలోకెల్లా అత్యంత ప్రాచీన కాలానికి అంటే క్రీ.శ.900 శతాబ్దానికి చెందింది. ఇది ‘కాళి’ మాతకు చెందింది.

WD|
అవి కొండలే కావచ్చు... కాని మనసుల్ని దోచే అరుదైన కళాఖండాలు ఆ కొండల మాటున దాగుని ఉన్నాయి. అవి రాళ్లే కావచ్చు... కాని జవ్వనులైన జవరాళ్లలా నాట్యం చేస్తాయి. ప్రపంచానికి భారతదేశం అందించిన వరాలీ శిల్పాలు.
కాందారియ మహాదేవ్‌ దేవాలయం : ఖజురహోలోని అతిపెద్ద దేవాలయం ఇది. దీని ఎత్తు 31మీటర్లు. ఇది శివాలయం.


దీనిపై మరింత చదవండి :