ఎప్పుడో పాతిక కోట్ల సంవత్సరాల క్రితం పుట్టి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి ఇటలీలోని డోలోమైట్స్ పర్వతాలు. అందమైన ఆల్ఫ్స్ పర్వతాలలో భాగమే ఈ డోలోమైట్స్. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా చేరి అరుదైన ఘనతను సంపాదించుకున్న డోలోమైట్స్... ప్రపంచంలోనే ఎంతో అందంగా కనిపించే పర్వాతాలుగా అలరిస్తున్నాయి.