తులిప్ గార్డెన్ అందాలను ఆస్వాదిద్దాం... రండి!!

Tulips garden
FileFILE
సాయం సంధ్యాకాలంలో చుట్టూ పచ్చగా భారీ వృక్షాలు.. రంగురంగుల పూలమొక్కలు... చల్లటి గాలి... ఇలాంటి వాతావరణం మనకు అందుబాటులో ఉంటే ఆ హాయి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. స్టోన్ బెంచ్ మీద కూర్చుంటే మన చుట్టూ బంగారు, గోధుమ రంగు, ఎర్రని తివాచిలా అనేక రకాల తులిప్స్ పుష్పాలుంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.

అలాంటిదే శ్రీనగర్‌లోని జబర్వాన్ కొండల దిగువ భాగాన 600 కెనాల్స్ భూభాగంలో ఉన్న తులిప్స్ గార్డెన్. ప్రఖ్యాతి గాంచిన దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ గార్డెన్స్‌ను సందర్శించడానికి ఏప్రిల్ నెల తొలి వారంలో అనుమతించనున్నారు. వీటిని సందర్శించడానికి కనీసం 12 లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే కొహిమారన్ కొండల దిగువలో ఉన్న అందమైన వియరీ బాదామ్‌ను చూసేందుకు ఈ నెలలోనే అనుమతిస్తారు.

Gayathri|
వేసవిలో మాత్రమే చూడగలిగే ఈ గార్డెన్‌ను అన్ని కాలాలలో సందర్శించే విధంగా చేయాలని అధికారుల సంకల్పం. ఏడాది ఆరంభంలో, మధ్యలో, ఆఖరులో పూచే అరవై రకాల పుష్పాలను ఈ గార్డెన్స్‌లో తిలకించవచ్చు. తెలుపు, ఎరుపు, ఆరంజ్, పర్పుల్ రంగులలో తులిప్స్ పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఈ గార్డెన్‌లో నాలుగు ఫౌంటెన్లు, గెట్ ప్లాజా, సిమెంట్ దారులు, పచ్చిక, బస చేయడానికి గెస్ట్ హౌస్‌ వంటి సౌకర్యాలను కూడా కల్పించారు.


దీనిపై మరింత చదవండి :