పిల్లా, పెద్దా అందరినీ అలరించే నయాగరా

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
అమెరికా, కెనడా సరిహద్దుల మధ్య ప్రవహించే చిన్న నదిగా నయాగరా తన ప్రయాణాన్ని సాగిస్తుంటుంది. మొత్తం 60.కి.మీ.ల పొడవుతో నయాగరా నది అలరారుతోంది. ప్రపంచంలోని అత్యంత వెడల్పైన జలపాతంగా నయాగరా జలపాతం పేరొందింది. మొత్తం పొడవుతో, 180 అడుగుల వైశాల్యంతో ఉన్న ఈ జలపాతాలను చూడడం ఓ అనిర్వచనీయమైన అనుభూతి. విదేశీ పర్యాటకులు తమ సందర్శనీయ ప్రాంతాల జాబితాలో తప్పక చేర్చవలసినవిగా నయాగరా జలపాతాలు వాసికెక్కాయి.

నింగి నుంచి నేలకు జారుతున్నట్లుగా సాగే నయాగరా జలపాతాలను రెండు రూపాల్లో చూడవచ్చు. కెనడా భూభాగంలో 2000 అడుగుల వెడల్పుతో 140 అడుగుల ఎత్తు నుంచి కిందపడే దృశ్యం కనులపండుగగా ఉంటుంది. అమెరికా భుభాగంలోని నయగారా జలపాతం కెనడా జలపాతం కన్నా ఎక్కువ ఎత్తు నుంచి పడుతున్నప్పటికీ తక్కువ వెడల్పును కలిగి ఉంటుంది. ఈ జలపాతం అమెరికాలోని డెట్రాయిట్ రాష్ట్రానికి సుమారు 300 మైళ్ల దూరంలో ఉంది.

జలపాతానికి దగ్గరగా ఓ వైపున కట్టిన రాక్‌లోంచి జలపాతాన్ని దగ్గరగా చూడడం చెప్పలేని మధురానుభూతి. అలాగే ఓ అద్దాల లిఫ్టులో రెయిన్ కోట్ వేసుకుని 125 అడుగుల లోతుకు తీసుకెళ్లే ఏర్పాటు సందర్శకులకు చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుంది. వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది పర్యాటకులు నిత్యం నయాగరాను సందర్శిస్తుంటారు.

నయాగరాకు సమీపంలో చూడవలసిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటిలో... ఒకటి మెరైన్ ల్యాండ్. ఇక్కడ సీ లయన్లు, తిమింగలాలు తదితర నీటి జంతువులు అందరినీ ఆకర్షిస్తాయి. వాటిని దగ్గరగా చూడొచ్చు, తాకొచ్చు కూడా. అలాగే మానావాళి పట్ల ప్రత్యేక శ్రద్దను చూపే డాల్ఫిన్ల షో ప్రేక్షకులను అబ్బురపరుస్తోంది. అలాగే అక్కడ ఉన్న బొటానికల్ గార్డెన్‌లో ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో పూసే 2300 రకాల గులాబీలు వర్ణశోభితమై అలరారుతుంటాయి. వీటితో పాటు సీతాకోక చిలుకల కన్జర్వేటరీలోని 2000 రకాల సీతాకోక చిలుకలు అన్ని వయస్సుల వారిని ఆకట్టుకుంటున్నాయి.

అలాగే కెనడా వైపు కాకుండా అమెరికా వైపు కూడా వెళ్లి దీనిని చూడొచ్చు. ఇది అమెరికన్ ఫాల్స్, కెనడా ఫాల్స్‌ మధ్యన ఉంటుంది. ఈ ప్రాంతంలో అమెరికన్ ఫాల్స్, బ్రైడల్ వీల్ పేర్లతో రెండు జలపాతాలున్నాయి. కెనడా వైపు లాగానే ఇక్కడ కూడా లిఫ్టులో జలపాతం వద్దకు వెళ్లి దగ్గరగా చూసీ ఆస్వాదించవచ్చు. పిల్లలు, పెద్దవారు. ప్రేమికులని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ చూసి ఆనందించే ప్రాంతం నయాగరా.
దీనిపై మరింత చదవండి :