ప్రకృతి అందాల నిలయం చిరపుంజి

Munibabu| Last Modified సోమవారం, 21 జులై 2008 (13:06 IST)
మేఘాలయా రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌కు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజి ఓ అందమైన ప్రకృతి నిలయం. దేశంలో అత్యధిక వర్షపాతం కలిగిన ప్రదేశమైన ఈ ప్రాతం పర్యాటకులకు ఓ అందమైన అనుభూతిని సొంతం చేస్తుంది. దాదాపు ప్రతిరోజూ వర్షం కురిసే ఈ ప్రాంతంలో మేఘాలు ప్రసవానికి సిద్ధమైన నిండు గర్భవతిలా హటాత్తుగా వర్షిస్తుంటాయి.

సముద్రమట్టం నుంచి దాదాపు 1300 మీటలర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలోనే దేశంలో అత్యధికంగా వర్షం పడే ప్రాంతంగా పేరు సంపాధించిన మాసిన్‌రామ్ ఉండడం విశేషం. దాదాపు ఓ చిన్న పట్టణంగా విరాజిల్లుతున్న ఈ ప్రదేశం ప్రకృతి శోభను సొంతం చేసుకున్న కొత్త పెళ్లి కూతురిలా మనల్ని ఇట్టే కట్టి పడేస్తుంది.

షిల్లాంగ్ నుంచి చిరపుంజి ప్రాంతానికి పయనమైన వారికి చుట్టూ నిలుచున్న పర్వతాలు అత్యంత మధురానుభూతిని కల్గిస్తాయి. ఘాట్ రోడ్‌లో సాగే ఈ ప్రయాణంలో చుట్టూ ఉన్న ఎత్తైన పర్వతాలు చూస్తూ వాటినుంచి జాలువారే జలపాతాలను తన్మయత్వంతో తిలకించవచ్చు.

చిరపుంజి ప్రాంతం దాదాపుగా లైమ్ రాతి గుహలతో నిండి ఉంటుంది. ఇక్కడ ఉన్న విశేషాల్లో పురాతన ప్రెస్బిటేరియన్ చర్చి, రామకృష్ణ మిషన్ లాంటి వాటిని దర్శించవచ్చు. దగ్గర్లో ఉన్న మాసిన్‌రామ్ ప్రాంతంలో ఏర్పడిన సహజ శివలింగ రూపం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ శివలింగాన్ని స్థానికులు మావ్ జింబుయిన్‌గా వ్యవహరిస్తారు.
దీనిపై మరింత చదవండి :