ఎత్తైన కొండ ప్రాంతాలు, లోతైన లోయలు, పచ్చిక బయళ్ళతో అలరించే ప్రకృతి సోయగాలకు ఆటపట్టు నాగాలాండ్. భారతదేశంలో ఇంగ్లీషు అధికారభాషగా ఉన్న ఒకే ఒక్క రాష్ట్రమిది. బర్మా - టిబెట్ దేశాలకు చెందిన 16 జాతులకు చెందిన గిరిజనులు చిత్ర విచిత్ర వేషధారణలతో దర్శనమిచ్చి చూపరులను ఆశ్చర్యపరుస్తారు. చేతులకు కంకణాలు, ఛాతీకి కవచాలు, చేతిలో రంగురంగుల ఆయుధాలు పట్టుకుని తిరుగాడే గిరిజనులు నాగాలాండ్‌లో కోకొల్లలు.