ఇది సుందర విశ్రాంతి ప్రదేశం. ఇక్కడ సగటు వర్షపాతం 165 సెం.మీ. వృక్షాలతో నిండివున్న ఈ పర్వత ప్రాంతాన్ని ఏప్రిల్ నుంచి జూన్, సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో దర్శించి సేద తీరండి. సంవత్సరం పొడవునా టూరిస్టులు వచ్చే పర్యాటక ప్రదేశం యిది. సీజన్లో వస్తే ఇక్కడి మనోహర దృశ్యాలను అందమైన ప్రకృతి లావణ్యాన్ని ఆస్వాదించవచ్చు.