భారత్‌లో నెంబర్ వన్ హిల్ కేంద్రం ఊటీ

Hanumantha Reddy| Last Modified గురువారం, 7 ఫిబ్రవరి 2008 (19:11 IST)
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిల్ కేంద్రాల్లో ఊటీ ప్రధమ స్థానాన్ని అలంకరించింది. ఔట్‌లుక్ న్యూస్ మ్యాగ్‌జైన్ పత్రిక సారధ్యంలో ఔట్‌లుక్ ట్రావెలర్‌ పేరిట నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెలువడినాయి. దీని ప్రకారం వేసవి ఉదగమండలమైన హిల్ కేంద్రాల రాణి 'ఊటీ'కే అధిక ఓట్లు పోలయినట్లు ఆ పత్రిక వెల్లడించింది.

నవంబర్ 2007లో ఔట్‌లుక్ ట్రావెలర్ అనే పేరుతో ఈ సర్వే ప్రారంభించినట్లు ఆ పత్రిక ఉన్నతాధికారి తెలిపారు. ఈ వివరాలన్నీ వెబ్‌సైట్‌లో ఇప్పటికే పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. ఉదగమండలంగా ఊటీ ఇప్పటీ ప్రముఖమైనదేనని.. సుమారు 17.1 శాతం ఓట్లు పోలవడంతో మొదటి స్థానాన్ని ఆక్రమించినట్లు పేర్కొన్నారు.

కాగా, తమిళనాడులోని మరో ప్రముఖ హిల్ కేంద్రం కొడైకెనాల్ 7.9 శాతం ఓట్లతో ఏడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ట్రోఫీని తమిళనాడు రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక విభాగానికి అందజేశామని వ్యాఖ్యానించారు.


దీనిపై మరింత చదవండి :