హిమాచల్ ప్రదేశ్ అనే పేరు చెప్పగానే మంచు పర్వతాలు, ప్రకృతి దృశ్యాలతో నిండిన విహార యాత్రా స్థలాలే ఎవరికైనా ఇట్టే గుర్తుకొస్తాయి. అయితే ఈ మంచు పర్వతాలలో అతి పురాతనమైన చరిత్ర కలిగిన దర్శనీయ క్షేత్రాలున్నాయంటే చాలామందికి నమ్మకం కలగదు. ఇక్కడి ఆలయాల్లో శిల్పకళను చూస్తే మైమరచిపోతాం. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటే రేణుకా క్షేత్రం.