మంచు శిఖరం "మౌంట్ కుక్" కరిగిపోతోంది...!!

FILE
దక్షిణార్ధ గోళంలోని అతిపెద్ద మంచు శిఖరం "మౌంట్ కుక్ గ్లేసియర్" గత 40 సంవత్సరాలలో దాదాపు 22 శాతం అంటే ఐదోవంతుమేర కరిగిపోయినట్లు పరిశోధకులు నిర్ధారించారు. ఫ్రాన్స్ దక్షిణ హిందూ మహా సముద్ర జలాల్లోని కెర్గుయెలెన్ ద్వీపంపై ఉన్న ఈ హిమ శిఖరం 1963లో 501 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండేది.

ఆ తరువాత 1963-1991 సంవత్సరాల మధ్యకాలంలో ప్రతి యేడాది దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు ఈ మంచు పర్వతం కరిగిపోతున్నట్లుగా పరిశోధకులు గుర్తించారు. ఇక ఆ తరువాత నుంచి మంచు పర్వతం కరిగే వేగం రెట్టింపై.. సంవత్సరానికి 3.8 కిలోమీటర్ల మేరకు మంచును కోల్పోవడం ప్రారంభించిందని పరిశోధకులు అంచనా వేశారు.

Ganesh|
1963వ సంవత్సరంతో పోల్చి చూసినట్లయితే మౌంట్ కుక్ గ్లేసియర్ ప్రస్తుతం 403 కిలోమీటర్లకే పరిమితమై ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పర్వతం ఇలాగే ప్రతి యేడాది రెట్టింపు సంఖ్యలో కరుగుతూ పోయే ప్రమాదం లేకపోలేదని వారు అభిప్రాయపడుతున్నారు.


దీనిపై మరింత చదవండి :