రాజస్థాన్ జైసల్మీర్‌కు ఏకాంతంగా వెళ్లి రండి

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
WD
రాజస్థాన్‌ను తలచుకోగానే గుర్తుకు వచ్చేది అక్కడి థార్ ఎడారి, రాజపుత్ర వీరగాథలు. అలా జైపూర్ నగరం విశిష్టమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. అయితే జైపూర్ నగరం గురించి తెలిసినంతగా జైసల్మీర్ గురించి తెలియదు. పట్టణ నాగరిక వాసనలకు దూరంగా నేటికీ మధ్యయుగపు రాజపుత్ర వాతావరణాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే ప్రదేశం జైసల్మీర్.

జైసల్మీర్ సుందర ప్రదేశం. అనేక రాజపుత్రుల వంశాల వీరగాథలకు సాక్షిగా నిలుస్తుంది. నాటి సంస్కృతిని, ప్రేమ కథలను ఆనందించాలంటే జైసల్మీర్‌కు భార్యాభర్తలు, ప్రేమికులు ఏకాంతంగా వెళ్లాల్సిందే. అక్కడికి వెళ్లిన తర్వాత హడావుడి పడకుండా ప్రశాంతంగా అక్కడి రాజపుత్ర మందిరాల్లో చేతిలో చేయివేసుకుంటూ నడవడం మరువలేని అనుభూతిని మిగుల్చుతుంది.

ఆనాటి రాజపుత్ర ప్రేమికులకు ఏమాత్రం తీసిపోని ప్రేమను పంచుకునే అవకాశాన్ని అక్కడి వాతావరణం కల్పిస్తుంది. నీటికొలను, ఆ కొలను ఒడ్డునే రాజసౌధం. మీ ప్రేమను అక్కడికక్కడ కవిత రూపంలో వ్యక్తికరించాలనే భావం కలుగుతుంది.

జైసల్మీర్‌కు వెళ్లాలంటే ముందుగా జోధ్‌పూర్ వెళ్లి అక్కడి నుంచి రోడ్డు ప్రయాణం చేయాలి. బస చేసేందుకు జైసల్మీర్‌కు దగ్గర్లో మంచి హోటళ్లు ఉన్నాయి. ఇక్కడివారు హిందీ, రాజస్థానీ, మార్వారీ భాషలు మాట్లాడుతారు.


దీనిపై మరింత చదవండి :