పర్యాటక ప్రాంతాలంటే ఎంతసేపూ ఏ ఊటీయో, కొడైకెనాలేనా? కాస్త డిఫరెంట్ పర్యాటకం ఏమయినా ఉంటే బావుండూ అని ఆలోచిస్తున్నారా? అయితే, మీకు రుషికేశ్ చక్కగా సరిపోతుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో రుషికేశ్ నగరం ఒకటి. ఎన్నో పుణ్యక్షేత్రాలతో తీర్థయాత్రా స్థలిగా ఉన్న ఈ నగరం ఇప్పుడు సాహస క్రీడల కేంద్రంగా కూడా మారుతోంది. 90లతో పోలిస్తే ఇటీవలి కాలంలో దేశంలో సాహస క్రీడలు, పర్వతారోహణ, బంగీ జంపింగ్, నదిలో సాహస యాత్రలంటూ సామాన్లు సర్దేవారి సంఖ్య పెరిగిపోయింది. వీటినే సాహస పర్యాటకం అని పిలుస్తున్నారు.