పచ్చటి ప్రకృతి పరచుకున్న దారులు, అందమైన కొండలు, ఘాట్ రోడ్లలో పర్వతాలపై దూసుకెళ్లే సొరంగ మార్గాలు, పొడవాటి వంతెనలు.. ఇలా ఒకటేమిటి షిమ్లాలో కనిపించే ప్రతి దృశ్యం మనల్ని అలాగే కట్టిపడేస్తుంది. స్థానిక దేవత శ్యామలాదేవి పేరుతో ప్రసిద్ధిగాంచిన ఈ ప్రదేశం భారతదేశంలోని ప్రముఖ పర్యాటక స్థలాలలో ఒకటిగా, వేసవి విడిదిగా పేరుగాంచింది. 1819లో బ్రిటీష్ వారిచే కనుగొనబడిన షిమ్లా, ఆ తరువాత 1864వ సంవత్సరంలో సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించబడింది.