వేసవిలో ఎండతాపాన్ని చల్లార్చుకునేందుకు చల్లగా ఉండే ప్రదేశాలను వెతుక్కుని మరీ వాలిపోయే ప్రకృతి ప్రేమికులకు అచ్చమైన దేశీయ కూల్ స్పాట్ కొడైకెనాల్. పర్యాటకులంతా ప్రిన్స్ ఆఫ్ హిల్స్టేషన్ అంటూ ముద్దుగా పిలుచుకునే ఈ ప్రదేశం దక్షిణ భారతదేశంలోని చెన్నై నగరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. పళని కొండల శ్రేణిలో సముద్ర మట్టంనుంచి 2,130 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలోని లోయలు, పర్వతాలు, పూల తోటలు, జలపాతాలు, సరస్సులు వీక్షకులకు కనువిందు కలిగిస్తాయి.