ఉత్తర ప్రదేశ్‌లో ప్రముఖ ప్రాంతమైన గోరఖ్‌పూర్ సర్వమతాలకు నిలయం. నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఉండటంవల్ల ఇక్కడ హిందూ, బౌద్ధ, జైన మతాలు విలసిల్లాయి. హిమాలయ పర్వతాల్లో ఉద్భవించిన రప్తి నది ఒడ్డున ఉంది గోరఖ్‌పూర్. భారత స్వాతంత్ర్యోద్యమ సమయంలో వివిధ ఘట్టాలకు నిలయం...