సాహసయాత్రల సదస్సు ప్రారంభం

న్యూఢిల్లీ (ఏజెన్సీ)| WD|
సాహస యాత్రలను నిర్వహించే ఆపరేటర్ల సమాఖ్య ఆరవ సదస్సును కేంద్ర పర్యాటకం మరియు సాంస్కృతిక శాఖ మంత్రి అంబికా సోనీ సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సాహస పర్యాటకం ప్రాధాన్యతను వెల్లడించే 30 సెకన్ల నిడివిని కలిగిన టీవీ కమర్షియల్‌ను మంత్రి విడుదల చేస్తారు. అదే సమయంలో 2007 సంవత్సరానికి నిర్వహించిన ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రచార కార్యక్రమం తాలూకు నివేదికను అంబికా సోనీ ఆవిష్కరిస్తారు.

'అడ్వంచర్ టూరిజమ్ : ది నెక్స్ట్ స్టెప్' ప్రధాన శీర్షికగా జరిగే ఈ సదస్సులో సాహస యాత్రా రంగానికి చెందిన జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటారు. పర్యాటక పరిశ్రమలో సాహస యాత్ర అత్యంత ప్రధానమైన విభాగాలో ఒకటి. జాతీయ మరియు అంతర్జాతీయ సాహస పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని పర్యాటక మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలను చేపట్టింది.


దీనిపై మరింత చదవండి :