సరదా ప్రయాణాలను ఇష్టపడేవారు కొందరయితే, సాహసాలు చేస్తూ ముందుకు ఉరికేవారు మరికొంతమంది. ఇక హిమాలయాల్లో ట్రెక్కింగ్ అంటే బోలెడంత సరదా, అంతే స్థాయిలో సాహసం.. కలగలసి ఉంటాయి. ఇక కొండలు ఎక్కి దిగుతూ గడిపేందుకు ఇష్టపడేవాళ్లు జీవితంలో ఒక్కసారయినా ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు వెళ్లి రావాలని కలలు కంటుంటారు. అయితే సముద్ర మట్టానికి 17,500 అడుగుల ఎత్తులో ఉండే ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు వెళ్లటం అంటే అంత సులభం కాదు...