సిరాజుద్దౌలా రాజధాని ముర్షీదాబాద్

Pavan Kumar| Last Modified గురువారం, 15 మే 2008 (20:10 IST)
ఆంగ్లేయుల సమయంలో బెంగాల్‌ను పాలించిన నవాబు సిరాజుద్దౌలా రాజధాని నగరం ముర్షీదాబాద్. ముస్లింల పాలనా కాలంలో ఈ ప్రాంతంలో అనేక కట్టడాలను ఇక్కడ నిర్మించారు. భాగీరథి నది ఒడ్డున ముర్షీదాబాద్ నగరం ఉంది. భారత చరిత్రను మలుపుతిప్పిన అనేక అంశాలకు వేదిక ముర్షీదాబాద్. ఈ ప్రాంతం నుంచి అప్పట్లో కోల్‌కతా నౌకాశ్రయం ద్వారా వర్తకం జరిగేది.

ముర్షీద్ ఖులీ ఖాన్ నవాబు పేరిట ఈ నగరానికి ముర్షీదాబాద్ పేరు వచ్చింది. సుబే బంగ్లాకు రాజధాని ముర్షీదాబాద్. సుబే బంగ్లా అంటే బెంగాల్, బీహార్, ఒరిస్సాలతో కూడిన ప్రాంతం. ప్లాసీ యుద్ధం తర్వాత ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఇక్కడ చాలా ఏళ్లు స్థావరాలు ఏర్పాటుచేసుకుని నివశించారు.

చరిత్రలో ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఇక్కడ బౌద్ధం, బ్రాహ్మణం, వైష్ణవం, జైన, ఇస్లాం, క్రైస్తవ మతాలు ఇక్కడ విలసిల్లాయి. ఐరోపాకు చెందిన డచ్, బ్రిటీష్, ఫ్రెంచ్, ఆర్మేనియన్లు ముర్షీదాబాద్‌లో నివశించారు.


దీనిపై మరింత చదవండి :