ఓ వైపు కొండ.. మరోవైపు లోయలో గలగలా పారే బియాస్ నదీమతల్లి పరవళ్లు, కొండచిలువలా మలుపులు తిరిగిన తారు రోడ్డు, 50 నుంచి 100 అడుగుల ఎత్తుదాకా పెరిగిన దేవదారు చెట్ల పరిమళం, నీరెండలో చల్లటి చలి...ఇంతటి వింత అనుభూతిని అందించే ఈ ప్రాంతంలో ఆహ్లాదం తప్ప మరేమీ కనిపించదు. అదే మన హిమాచల్‌ప్రదేశ్. భగభగా మండే ఎండల నుంచి మంచు కొండలకు, కాంక్రీట్ అడవుల నుంచి కీకారణ్యానికి, రణగొణ ధ్వనుల నుంచి కిలకిలారావాల వైపుకు.. మహా కాలుష్యం నుంచి స్వచ్ఛమైన వాతావరణానికి.. యాంత్రిక ప్రపంచానికి దూరం...