శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పర్వత ప్రాంతాలు
Written By WD

తమిళనాడులోని మరో సుందర ప్రదేశం కొడైకెనాల్

ప్ర్సిన్‌ ఆఫ్‌ హిల్‌ స్టేషన్‌ :
ఇది సుందర విశ్రాంతి ప్రదేశం. ఇక్కడ వర్షపాతం సగటున 165 సెం.మీ. వృక్షాలు నిండివున్న ఈ పర్వత ప్రాంతాన్ని ఏప్రిల్‌ నుంచి జూన్‌, స్టెపెంబర్‌ నుంచి అక్టోబర్‌లో దర్శించి సేద తీరండి. సంవత్సరం పొడవునా టూరిస్టులు వచ్చే పర్యాటక ప్రదేశం యిది.
WD
సీజన్‌లో వస్తే ఇక్కడి మనోహర దృశ్యాలను అందమైన ప్రకృతి లావణ్యాన్ని ఆస్వాదించవచ్చు.


కొడైకెనాల్‌ వాతావరణం :
వేసవి కాలం : 19.8 డిగ్రీల సెంటిగ్రేడ్‌ నుంచి 14.3 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు
చలికాలం : 17.3 డిగ్రీల సెంటిగ్రేడ్‌ నుంచి 8.3 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు
మ్సనసుకి హాయి గొలిపే ఈ ప్రాంతానికి రావటానికి దగ్గరలో వున్న ఎయిరప్ోర్ట్‌ మధురై 120 కి.మీ దూరంలో వుంది. 135 కి.మీ దూరంలో కోయంబత్తూరు ఉంది.
రైలు మార్గం : కొడై రైల్వే స్టేషన్‌ 80 కి.మీ లలో పళని రైల్వే స్టేషన్‌ 64 కి.మీ దూరంలో వుంది.
బస్సు : ఇక్కడికి బెంగుళూరు, చెన్నై పళని, మధురై, దిండిగల్‌, తిరుచిరాపల్లి, ఈరోడ్‌, కుయిలి నుంచి బస్సు సౌకర్యం ఉంది. ముఖ్యమైన టెలిఫోన్‌ నెంబర్స్‌ :
గవర్నమెంట్‌ హాస్పిటల్‌ ఫోన్‌ : 41292
టీ.వీ. రిలే మానిటర్‌ : 41026
ప్రతి సంవత్సరం మే లో బోట్‌ రేసులు జరుగుతాయి. అప్పుడే ఫ్లవర్‌ షో జరుగుతుంది. అద్భుతంగా ఉంటుంది ఈ పూల సంత. కొడైకెనాల్‌ నుంచి మధురై 120 కి.మీ కొడైకెనాల్‌ రోడ్డు 80 కి.మీ, పళని 65 కి.మీ, కోయంబత్తూరు 78 కి.మీ, తిరుచ్చి 197 కి.మీ, దిండిగల్‌ 110 కి.మీ.

షాపింగ్‌ : ఖాది ఎంపోరియం, హేండ్లూం, కో- ఆపరేటివ్‌ స్టోర్‌, గవర్నమెంటు సేల్సు ఎంపోరియం, మినీ సూపర్‌బజార్‌, స్పెన్సర్‌ అండ్‌ కంపెనీ.

పర్యాటక ప్రదేశాలు :
లేక్‌ : 60 ఎకరాల్లో ఉన్న ఆకర్షణీయమైన లేక్‌ చుట్టూ పచ్చటి పొలాలు, బోటింగ్‌ సౌకర్యం టిటిపిసి వారు ఏర్పాటు చేశారు.

బ్రయింటు పార్క్‌ : లేక్‌కి తూర్పు దిశలో ఉన్న సుందర పార్కులో మేలో హిస్టారికల్‌ షో జరుగుతుంది.

సోలార్‌ ఫిజికల్‌ అబ్జర్వేటరీ : 3.2 కి.మీ దూరంలో ఈ ప్రదేశం కొడైలో ఎత్తయినది.

ఆండవర్‌ టెంపుల్‌ : 3.2 కి.మీ దూరంలో ఉంది. మురుగన్‌ స్వామి ఈ ఆలయంలో కొలువై ఉంటారు. ఈ పాయింట్‌ నుంచి చూస్తే ఉత్తరాన ఉన్న పళని హిల్స్‌ చూడవచ్చు.

టెలిస్కోప్‌ హౌస్‌ : ఇక్కడ రెండు టెలిస్కోప్‌ హౌసెస్‌ వున్నాయి. ఒకటి కురింజి ఆండవార్‌ టెంపుల్‌ దగ్గర ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు తెరిచి వుంటుంది. రెండోది కూసకలు వీక్‌. ప్రవేశం ఒక రూపాయి.

గ్రీస్‌ వేలియవూ : 5 కి.మీ దూరంలో ఉన్న ఈ వ్యూ నుంచి వైగై డ్యామ్‌ కనిపిస్తుంది.

పిల్లర్‌ రాక్స్‌ : 7.4 కి.మీ దూరంలో యిక్కడ నుంచి సుందర ప్రకృతి కాంత సమస్త అందాలను చూడవచ్చు. ఇక్కడ సహజ సిద్ధమైన మూడు పొడవైన శిలలు ఒకదానికొకటి ఆనుకుని 400 అడుగులు ఎత్తు కలిగి వుంటాయి.

బీల్‌ షోలా ఫాల్స్‌ : 1.6 కి.మీ దూరంలో వున్న బ్యూటీ ఫర్‌ పిక్నిక్‌ స్పాట్‌.

కొడైకెనాల్‌ పరిసర ప్రాంతాలు :

సిల్వర్‌ కాస్కేడ్‌ : ఈ జలపాతాలు ఘాట్‌రోడ్‌ వద్ద ఉన్నాయి. కొడైకెనాల్‌ నుంచి 8 కి.మీ దూరంలో ఉంది ఈ స్పాట్‌.

మ్యూజియం : 3 కి.మీ దూరంలో వుంది. 1890లో స్థాపించబడిన ఒక కాలేజి వారిచే ఈ పుష్పాల మ్యూజియం నిర్వహించబడుతుంది. మన దేశంలో వున్న ఆర్కిటోరియంలలో ఇది ఒకటి. ఇందులో 300 జాతులికి పైగా మొక్కలు వున్నాయి.

డోలు మెన్స్‌ సర్కిల్‌ : 22 కి.మీ దూరంలో ఉన్న పురాతన కాలం నాటి స్థలం

పెరుమాళ్‌ పీక్‌ : 11 కి.మీ దూరంలో గల ఈ ప్రదేశం 2,400 మీటర్ల ఎత్తున వున్న శిఖరం. ఈ ప్రయాణం పెరుమాళ్‌ మలాయ్‌ గ్రామం నుంచి ప్రారంభమౌతుంది. ఇక్కడ వాతావరణం చూస్తే ఈ ప్రాంతానికి వలస పోదామా అనిపిస్తుంది.

బెరిజం లేక్‌ : 21 కి.మీ దూరంలో గల ఈ ప్రదేశం సూపర్‌ పిక్నిక్‌ స్పాట్‌

కుక్కుళ్‌ కేవ్స్‌ : గుహల్లో నివసించే మానవులు ఈ గుహల్లో నివసించే వారు. ఇప్పుడిది విడిది.

డాల్ఫిన్‌ నోస్‌ : రాయి నిరాధారంగా కనబడుతూ చివరి భాగం ఆవలించిన నోరులా కనిపిస్తుంది.

పళని : హిందూ దేవాలయం వుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరు అవతారాల్లో ఒక మూర్తి అవతారం ఇక్కడ చూడవచ్చు. పళని రేంజ్‌లో వెస్ర్టన్‌ ఘాట్స్‌లో ఈ గుడి పర్వతం మీద వుంది. 64 కి.మీ దూరంలో వుంది కొడైకెనాల్‌కి.

కుంభక్కరై : 12 కి.మీ దూరంలో ఈ ప్రాంతం అద్భుతమైన పిక్నిక్‌ స్పాట్‌, అందమైన జలపాతాలు ఉన్నాయి.

కొడై ఇంటర్‌ నేషనల్‌ : లామ్స్ ఘాట్‌ రోడ్‌, ఫోన్‌ : 40767 కొడైరిసార్ట్‌ హోటల్‌ నాయిస్‌రోడ్‌, ఫోన్‌ : 40632. గార్డెన్‌ మానర్‌, లేక్‌రోడ్‌, ఫోన్‌ : 40462. హోటల్‌ ఎస్టోరియా, అన్నాశాలై, ఫోన్‌ : 40524, యూత్‌ హాస్టల్‌, గ్రీన్‌ ల్యాండ్స్‌, ఫోన్‌ : 41009.

ముదుమలై అడవులు : ఊటి నుంచి 67 కి.మీ దూరంలో మైసూర్‌కు వెళ్ళే దారిలో ఉన్నాయి. ఈ అరణ్యాలు, నీలగిరి మీద 3000 ఎత్తులో ఉన్న అరణ్యాలివి. ఇక్కడ చాలా సహజంగా ఏనుగులు, డీర్స్‌, పెద్దపులి, చిరుతలు చూడవచ్చు. నక్కలు, కోతులు, ముంగిసలు, గండుపిల్లులు లాంటివి అనేకం అడుగడుగునా కనిపిస్తుంటాయి. ఏప్రిల్‌ నెలలో రాత్ర్ళిళు మిణుగురు పురుగులతో అడవి అంతా మెరిసిపోతుంటుంది. ఈ అడవి మొత్తం చూడడానికి కారు లేదా ఏనుగు మీద గాని చూడవచ్చు. ఈ సౌకర్యాన్ని ఫారెస్టె డిపార్ట్‌మెంట్‌ వారు కల్పిస్తారు. బెస్ట్ సీజన్‌ మార్చి - జూన్‌ మధ్య చూడటానికి అనువుగా వుంటుంది.

ఇక్కడికి దగ్గరిలో రెస్టెహౌస్‌, టూరిస్ట్ లాడ్జి వుంది. ఇంకా లగ్జరీలో బాంబూ బ్యాంక్స్‌ ఫామ్‌ గెస్టె హౌస్‌, లాగ్‌ హౌస్‌, ముసిని గుడిలో తెప్పకాడులో యూత్‌ హాస్టల్‌ వున్నాయి. ఈ ప్రదేశాలన్నీ ముదుమలై వైల్డ్‌లైఫ్‌ శాంక్చువరీ పరిసరాలు.